కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

  • వరుణ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్
  • పిటిషన్ దాఖలు చేసిన కే. శంకర్ అనే వ్యక్తి
  • సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణ
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్న వేళ, సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం సిద్ధరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, వరుణ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా, శంకర పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సిద్ధరామయ్యకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.


More Telugu News