దూసుకుపోతున్న 'దురంధర్' .. 3 రోజుల్లో 100 కోట్లు!

  • ఈ నెల 5న విడుదలైన 'దురంధర్'
  • తొలి ఆటతోనే అనూహ్యమైన రెస్పాన్స్ 
  • ప్రత్యేక ఆకర్షణగా భారీ తారాగణం  
  • 3 రోజుల్లో 118 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • మరిన్ని రికార్డులు ఖాయమనేది బాలీవుడ్ టాక్  
 
బాలీవుడ్ సినిమా ఒకటి ఇప్పుడు బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపేస్తోంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అంతగా వాళ్లను ఆకట్టుకున్న సినిమానే 'దురంధర్'. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. టైటిల్ తోనే ఈ సినిమా అందరిలోను ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. పోస్టర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు .. నమ్మకాలు పెరుగుతూ వెళ్లాయి. 

అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో విడుదలైంది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. యాక్షన్ డ్రామా ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిందనే టాక్ వినిపించింది. టాక్ కి తగినట్టుగానే రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ వెళ్లాయి. అలా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ సినిమా 118 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 

రణ్ వీర్ ఇంతకు ముందు చేసిన సినిమాలలో, 'పద్మావత్' .. 'సింబా' సినిమాలు తొలి మూడు రోజులలో 75 కోట్ల వసూళ్లను దాటాయి. ఆ రెండు సినిమాల వసూళ్లను అధిగమిస్తూ, ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను దాటేయడం విశేషం. ఈ సినిమా జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ రాంపాల్ .. అక్షయ్ ఖన్నా .. సారా అర్జున్ కనిపించనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ రేటుకు 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. 




More Telugu News