తెలంగాణ రైజింగ్​ గ్లోబల్ సమ్మిట్‌.. సీఎం చంద్ర‌బాబు విషెస్

  • ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్ష
  • వృద్ధి, ఆవిష్కరణ, పురోగతికి కొత్త మార్గాలు తెరవాలని అభిలషించిన ఏపీ సీఎం
  • రాజకీయాలకు అతీతంగా పొరుగు రాష్ట్ర సదస్సుకు అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025‌కు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ప్ర‌త్యేక పోస్టు పెట్టారు. 

"తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వేదిక తెలంగాణ రాష్ట్రంలో వృద్ధి, ఆవిష్కరణలు, పురోగతికి సరికొత్త మార్గాలను తెరుస్తుందని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న కీలకమైన సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు తెలపడం రాజకీయ వర్గాల్లో సానుకూల వాతావరణాన్ని సూచిస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ఇటువంటి సంకేతాలు దోహదం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


More Telugu News