వివాహ వేడుకలో ఆసక్తికరం.. సరదాగా 8వ వచనం జోడించిన వరుడు

  • సంప్రదాయ ఏడు ప్రమాణాలకు ఎనిమిదో వచనం జోడించిన వరుడు
  • వధువుతో పాటు సరదాగా నవ్వుకున్న అతిథులు
  • ఈరోజు నుంచి ఏసీ ఉష్ణోగ్రతను నేనే నియంత్రిస్తానంటూ సరదా వ్యఖ్య
ఢిల్లీలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సాంప్రదాయబద్ధంగా జరిగే ఏడు ప్రమాణాలకు వరుడు ఒక వినూత్నమైన '8వ వచనం' జోడించాడు. మయాంక్ అనే వరుడు చేసిన ఈ ఎనిమిదో వాగ్దానం అక్కడ ఉన్నవారికి నవ్వులు పూయించింది. వధువుతో పాటు అతిథులందరూ సరదాగా నవ్వుకున్నారు.

మయాంక్, దియా జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సాంప్రదాయ ఏడు ప్రమాణాలను వరుడు మయాంక్‌ వల్లె వేశాడు. ఆ తర్వాత మైక్‌ తీసుకుని, మరొక వాగ్దానానికి వధువు అంగీకరించాలని కోరాడు. "ఈ రోజు నుంచి మన గదిలో ఏసీ టెంపరేచర్ ను నేనే నియంత్రిస్తాను" అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.


More Telugu News