ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు
- ప్రభుత్వ కోటా సీట్లకు రూ. 30 వేలుగా నిర్ణయం
- సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు రూ. 9 లక్షల ఫీజు
- ఈ ఏడాది 60 పీజీ సీట్లను కేటాయించిన జాతీయ వైద్య మండలి
- ఫీజుల నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కోటా సీట్లకు వార్షిక ఫీజును రూ. 30 వేలుగా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా సీట్లకు రూ. 9 లక్షలుగా నిర్ధారించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు వైద్య కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం నుంచి 60 పీజీ సీట్లను జాతీయ వైద్య మండలి (NMC) కేటాయించిన విషయం తెలిసిందే. ఈ సీట్లకు సంబంధించి ఫీజుల ఖరారుపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించిన విధానంలో ఫీజులను సమీక్షించి ఈ తుది నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఫీజుల ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది నుంచే కొత్త పీజీ సీట్లలో ప్రవేశాలకు మార్గం సుగమమైంది.