పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
- పాక్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా అసిమ్ మునీర్
- దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారిన ఆర్మీ మాజీ చీఫ్
- అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ
- త్రివిధ దళాల సమన్వయం కోసం కొత్తగా సీడీఎఫ్ పదవి ఏర్పాటు
పాకిస్థాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) పదవిలో నియమించింది. ఈ నియామకంతో ఆయన పాకిస్థాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించారు. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఏకీకృతం చేసే లక్ష్యంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాక్ ప్రభుత్వం ఈ సీడీఎఫ్ పదవిని తీసుకొచ్చింది. ప్రధాని సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నియామకాన్ని ఆమోదించినట్టు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పదవిలో మునీర్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. సీడీఎఫ్‌గా ఆయనకు అధ్యక్షుడితో సమానంగా న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. దీనివల్ల ఆయనపై ఎలాంటి విచారణ జరిపే అవకాశం ఉండదు.
ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన అసిమ్ మునీర్ ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను కూడా అందుకున్నారు. పాక్ చరిత్రలో జనరల్ అయూబ్ ఖాన్ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో వ్యక్తి మునీర్ కావడం విశేషం. గత నెల 29న ఆయన ఆర్మీ చీఫ్ పదవీ కాలం ముగిసింది.
కాగా, ఈ నియామకానికి ముందు ప్రభుత్వం, సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయని, ప్రధాని షేక్ బాజ్ షరీఫ్ కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వాటన్నింటికీ తెరదిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.