పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టులో అప్పీల్
  • సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేసిన నిందితుడు రవికుమార్
  • లోక్ అదాలత్‌లో రాజీ చిన్న విషయం కాదన్న ధర్మాసనం
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవడం చిన్న విషయమేమీ కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా, సతీష్‌కు సంబంధించిన కేసు లోక్ అదాలత్‌లో రాజీకి అవకాశం లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. "సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముంది? అది కేవలం ప్రాథమిక అభిప్రాయం మాత్రమే" అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ఆలయాల ప్రయోజనాలను కాపాడటంలో కోర్టులే మొదటి సంరక్షకులుగా వ్యవహరిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. పరకామణి చోరీ వంటి తీవ్రమైన కేసులో రాజీ కుదుర్చుకోవడాన్ని తేలికగా తీసుకోలేమని అభిప్రాయపడింది. అనంతరం, రవికుమార్ దాఖలు చేసిన అప్పీల్‌పై తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. 


More Telugu News