సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • అహ్మదాబాద్‌లోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
  • 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సురక్షితంగా ల్యాండింగ్ అయిన విమానం
  • తనిఖీల్లో ఏమీ లేదని తేలిన వైనం
సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో, దానిని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కూడిన 6ఈ58 విమానం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

విమానం గాల్లో ఉండగానే ఇండిగోకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అహ్మదాబాద్ సమీప విమానాశ్రయం కావడంతో, ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విమానాన్ని అక్కడికి మళ్లించారు.

ల్యాండింగ్ అనంతరం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది, స్థానిక పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో కలిసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.


More Telugu News