భారత్ ముక్కలవ్వనంత వరకు మాకు శాంతిలేదు: బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ సంచలన వ్యాఖ్యలు
- భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా
- ఏడాది కాలంగా భారత్‌పై బంగ్లా నాయకుల విమర్శలు
- భారత్ ముక్కలయ్యేంత వరకు బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనదని వ్యాఖ్య
భారతదేశం ముక్కలు కానంత వరకు బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనదని బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నందున ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఆయన అన్నారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నాయకులు భారత్‌పై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆర్మీ మాజీ జనరల్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తికి భారత్ చేసిన సహాయాన్ని మరిచి ఆ దేశ నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్న సమయంలో అమాన్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.