దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే
- డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్
- పునరాగమనం చేయనున్న హార్దిక్ పాండ్యా
- బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తే ఆడనున్న గిల్
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో మెడ నొప్పితో మైదానాన్ని వీడిన శుభ్‌మన్ గిల్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడుతాడు. గత నెలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ మైదానం వీడిన విషయం తెలిసిందే.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
తొలి టీ20 డిసెంబర్ 9న కటక్‌లో, రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్‌పూర్‌లో, మూడో టీ20 డిసెంబర్ 14న ధర్మశాలలో, నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నోలో, ఐదో టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.