సంచలనమే సరిహద్దుగా 'అఖండ 2'

  • బాలయ్యబాబుకి డిసెంబర్ సెంటిమెంట్ 
  • 2021 డిసెంబర్ లో వచ్చిన 'అఖండ'
  • ఈ నెల 5వ తేదీన బరిలోకి దిగుతున్న 'అఖండ 2'
  • బ్లాక్ బస్టర్ ఖాయమంటున్న ఫ్యాన్స్

బాలకృష్ణ అభిమానులంతా ఇప్పుడు 'అఖండ 2' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన 'అఖండ' భారీ విజయాన్ని సాధించడంతో, సహజంగానే సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకూ బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా, వసూళ్ల కొత్త రికార్డులను తిరగరాయడం మరో కారణం.

బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, ఓవర్సీస్ లోను తన సత్తాను చాటుకుంది. 10 రోజులలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం. తొలిసారిగా తెరపై బాలయ్య 'అఘోర'గా కనిపించడం .. ఆయన మాస్ యాక్షన్ కి ఆధ్యాత్మిక శక్తి తోడు కావడం .. బోయపాటి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ .. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ నెల 5వ తేదీన 'అఖండ 2' థియేటర్లలోకి దిగిపోతోంది. 

బాలకృష్ణ కెరియర్ ను ఒకసారి పరిశీలిస్తే, ఆయన సినిమాలు డిసెంబర్ లో వచ్చినా .. జనవరిలో విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 'అఖండ' కూడా 2021లో డిసెంబర్ లో వచ్చిందే. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా డిసెంబర్ లో రంగంలోకి దిగుతోంది. 200 కోట్ల రూపాయాల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, సంచలనమే సరిహద్దుగా దూసుకుపోతుందనీ, రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి మరి.



More Telugu News