నటి సమంతతో వివాహం... రాజ్ మాజీ భార్య ఆసక్తికర పోస్టు
- నిన్న వివాహ బంధంతో ఒక్కటైన రాజ్, సమంత
- విశ్వంలో మనం ఒక మూలన ఉన్నామని అర్థం వచ్చేలా శ్యామలి పోస్టు
- విశ్వం చిత్రంలో చిన్న గ్రహం చూపిస్తూ, మనం ఇక్కడ జీవిస్తున్నామని పోస్టు
ప్రముఖ నటి సమంత, దర్శకుడు రాజ్ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాలలో దర్శనమివ్వడంతో రాజ్ మాజీ భార్య శ్యామలి స్పందించారు. ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే శ్యామలి, ఈ అనంత విశ్వంలో మనం ఒక మూలన ఉన్నామని అర్థం వచ్చేలా ఒక ఛాయాచిత్రాన్ని పంచుకున్నారు. విశ్వం చిత్రంలో ఒక చిన్న గ్రహం వైపు బాణం చూపిస్తూ, ఇక్కడ మనం నివసిస్తున్నామంటూ రాసుకొచ్చారు. సమంత-రాజ్ వివాహం తర్వాత శ్యామలి చేసిన మొదటి పోస్టు ఇది. అంతకుముందు కూడా వరుసగా పలు పోస్టులు పెట్టారు.
రాజ్-సమంతల వివాహం నిన్న జరగగా, ఉదయం శ్యామలి పెట్టిన ఒక పోస్టు చర్చనీయాంశమైంది. తెగించిన వ్యక్తులు దానికి తగిన విధంగానే వ్యవహరిస్తారని పేర్కొన్నారు. మనతో రుణం ఉన్నంత వరకే బంధాలన్నీ మనతో ఉంటాయని, రుణం తీరిన తర్వాత బంధం శాశ్వతంగా దూరమవుతుందని మరో పోస్టు చేశారు.