తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకండి: పారిశ్రామికవేత్తలకు మంత్రి అజారుద్దీన్ పిలుపు
- హైదరాబాద్‌లో జరిగిన బీటీ గోల్ఫ్ 2025–26 ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మంత్రి అజారుద్దీన్
- డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ
- ఈ సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు
- సీఎం రేవంత్ రెడ్డి ట్రిలియన్ డాలర్ల లక్ష్యంలో ఇదో కీలక అడుగని వెల్లడి
ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ.. బీటీ గోల్ఫ్ ఈవెంట్ ప్రతిభ, స్నేహభావం, వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి ఒక అద్భుతమైన వేదిక అని ప్రశంసించారు. టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని అజారుద్దీన్ వివరించారు. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

