కోయంబత్తూరు ఈశా ఆధ్యాత్మిక కేంద్రంలో పెళ్లితో ఒక్కటైన సమంత-రాజ్!
- దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సమంత
- కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో నిరాడంబరంగా వేడుక
- గత కొంతకాలంగా సాగుతున్న ప్రేమ ప్రచారానికి తెర
- సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో సోమవారం తెల్లవారుజామున వీరి పెళ్లి వేడుక అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. ఈ జంట తమ వివాహ విషయాన్ని ఈరోజు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్-డీకే ద్వయం దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' వంటి వెబ్ సిరీస్‌లలో సమంత కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రాజెక్టుల సమయంలోనే వీరి మధ్య స్నేహం బలపడి, ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి బంధంపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.
వివాహ వేడుకలో సమంత ఎర్రచీరలో సాంప్రదాయబద్ధంగా కనిపించినట్టు ఫొటోలు దర్శనమిస్తున్నాయి. నటుడు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో వివాహం జరిగిందన్న వార్త తెలియడంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంట నుంచి రాబోయే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.