RTC Bus: బస్సులో సీటు కోసం రచ్చ... ప్రయాణికుడి జుట్టు పట్టుకుని కొట్టిన మహిళ... వీడియో ఇదిగో!

RTC Bus Fight Woman assaults passenger over seat in RTC bus
  • ఆర్టీసీ బస్సులో సీటు కోసం తీవ్ర వాగ్వాదం
  • కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చున్నాడని ప్రయాణికుడిపై దాడి
  • తుని-నర్సీపట్నం బస్సులో ఘటన 
  • మహిళల ఉచిత ప్రయాణంతో బస్సుల్లో పెరుగుతున్న రద్దీ
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన ఓ చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ మహిళ సహ ప్రయాణికుడిపై దాడి చేసి, జుట్టు పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, కొంతమంది మహిళలు ఓ సీటులో కర్చీఫ్ వేసి ఉంచారు. అది గమనించని ఓ ప్రయాణికుడు ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ, "మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావు?" అంటూ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఆమె సహనం కోల్పోయి, సదరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని దాడి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో అతడు నివ్వెరపోయాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. 
RTC Bus
Andhra Pradesh RTC
Free Bus Travel
Narasipatnam
Tuni
Bus Seat Fight
Woman Assault
Bus Passenger
APSRTC
Bus fight video

More Telugu News