Rashmika Mandanna: ఓటీటీ తెరపైకి బాలీవుడ్ హిట్ .. 'థామా'

Thamma Movie Update
  • హిందీలో రూపొందిన 'థామా'
  • డిఫరెంట్ జోనర్ ను టచ్ చేసిన కంటెంట్ 
  • థియేటర్ల వైపు నుంచి దక్కిన హిట్ 
  • రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో

రష్మిక -  ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలను పోషించిన 'థామా', అక్టోబర్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. దినేశ్ విజన్ - అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించాడు. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. బాలీవుడ్ లో బలమైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రష్మికకి ఈ సినిమా గట్టి హిట్ నే ఇచ్చింది. 

హారర్ .. కామెడీ .. ఫాంటసీ టచ్ తో కొనసాగే ఈ సినిమాలో, లవ్ పాళ్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ జోనర్లో డిజైన్ చేసుకున్న ఈ సినిమా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా? అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రేపటి నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది. 

అలోక్ గోయల్ ఓ జర్నలిస్ట్. అతను ఓ న్యూస్ ను కవర్ చేయడం కోసం తన మిత్రులతో కలిసి ఒక పర్వత ప్రాంతానికి వెళతాడు. అక్కడ అతనిపై ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది. బేతాళ జాతికి చెందిన యువతి 'తడ్కా' అతనిని కాపాడుతుంది. తన గూడెం ప్రజలు అతని ప్రాణాలకు హాని తలపెట్టడానికి ప్రయత్నించగా అప్పుడూ కాపాడుతుంది. అలోక్ ను ప్రేమించిన ఆమె, అతనితో  కలిసి బయట ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Rashmika Mandanna
Ayushmann Khurrana
Bhediya
Bhediya Movie
Amazon Prime
Bollywood Horror Comedy
Dinesh Vijan
Amar Kaushik
Aditya Sarpotdar
Bhediya OTT Release

More Telugu News