Parliament Winter Session: ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. 14 బిల్లులతో సిద్ధమైన కేంద్రం

Parliament Winter Session Begins
  • 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
  • డిసెంబర్ 19 వరకు కొనసాగనున్న సమావేశాలు
  • కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే, ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఈ సమావేశాల్లో 14 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వగా, పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేశాయి.

ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారుల సవరణ వంటి ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. వీటి ద్వారా పలు సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు, కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, ఢిల్లీలో జరిగిన పేలుడు, జాతీయ భద్రత, పెరుగుతున్న కాలుష్యం, రైతులకు కనీస మద్దతు ధర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో, ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

కాగా, కొత్త ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ అధ్యక్షతన రాజ్యసభ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ సమావేశాలు మొత్తం 15 రోజుల పాటు కొనసాగుతాయి. 
Parliament Winter Session
Parliament
Winter Session 2023
Central Government Bills
Radhakrishnan
Loksabha
Rajyasabha
Indian Economy
Voter List Amendment

More Telugu News