యూకేలో భారత విద్యార్థి హత్య
- కత్తులతో దాడి చేసిన దుండగులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన హర్యానా
యువకుడు - ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసిన యూకే పోలీసులు
ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లిన హర్యానా యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 25న దుండగులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. బాధిత కుటుంబం, యూకే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్యానాకు చెందిన విజయ్ కుమార్ షియోరాన్ (30) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ఉద్యోగి. ఉన్నత చదువుల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఏడాది ప్రారంభంలో యూకే వెళ్లాడు. ఈ క్రమంలో ఈ నెల 25న వోర్ స్టర్ లో విజయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయ్ ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ విజయ్ తుదిశ్వాస విడిచాడు.
విజయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన యూకే పోలీసులు.. విజయ్ పై దాడి చేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. విజయ్ హత్యకు గురయ్యాడని తెలిసి ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విజయ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ శాఖకు, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీలకు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.