ఓటీటీలోకి వచ్చేస్తున్న రష్మిక కొత్త సినిమా.. ఎందులోనంటే!




నేషనల్ క్రష్ రష్మిక మంధాన తాజా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ త్వరలో ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 7న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమాలో భూమా పాత్రలో రష్మిక జీవించారని ప్రేక్షకులు ప్రశంసించారు.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో డిసెంబర్‌ 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.


More Telugu News