బీఆర్ఎస్ దీక్షా దివస్‌పై మంత్రి సీతక్క విమర్శలు
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే నిర్వహించేవారన్న సీతక్క
- ప్రజలకు పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్
- రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెబుతామన్న మంత్రి
ఈ విజయాలను ప్రజలకు వివరించేందుకు తాము పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రతోనే బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతోందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక వందల రెట్లు లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబమేనని ఆమె ఆరోపించారు.
ఆ పార్టీ దగ్గర ప్రస్తుతం అధికారం మాత్రమే లేదని, కానీ కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటామని, లేకపోతే బయటకే రావొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని ఆమె విమర్శించారు. దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు విశ్వసించరని ఆమె స్పష్టం చేశారు.