అఖండ-2 టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్

  • బాలయ్య 'అఖండ 2' టీజర్ విడుదల
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచిన టీజర్
  • ఆకట్టుకుంటున్న బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్స్
  • డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం విడుదల
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'అఖండ 2' నుంచి పవర్ఫుల్ టీజర్ విడుదలైంది. 'అఖండ 2 మ్యాసివ్ తాండవం' పేరుతో విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

"చెడు ఎక్కడ జరిగినా దేవుడు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు.. బీ బ్రేవ్" అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. గతంలో సంచలన విజయం సాధించిన 'అఖండ' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజా టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. 


More Telugu News