ఈ ప్రయాణం ఇక ఎవరూ ఆపలేరు: సీఎం చంద్రబాబు
- అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపన
- కేంద్ర సహకారంతో అమరావతి ఇక అన్ స్టాపబుల్ అని సీఎం ధీమా
- 2028 నాటికి రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం
- పోలవరం పూర్తి చేసి రాయలసీమకు సాగునీరు అందిస్తామని హామీ
- రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖకు గూగుల్ రాక
కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్‌స్టాపబుల్... ఈ ప్రయాణాన్ని ఇక ఎవరూ ఆపలేరు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించామని, 2028 నాటికి అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో శుక్రవారం 15 బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించే లక్ష్యంతో రూ.1,334 కోట్ల వ్యయంతో 15 ప్రతిష్ఠాత్మక ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డ్ వంటి దిగ్గజ సంస్థల రాకతో అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శరవేగంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 6,556 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో, అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో నిర్మించాలని ఆయన కోరారు.
రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు శిరస్సు వంచి నమస్కరించారు. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని కొనియాడారు. రాజధాని పునర్నిర్మాణ పనుల కోసం కేంద్రం రూ.15 వేల కోట్లను కేటాయించిందని గుర్తుచేశారు. "దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టారు. వారి సహకారంతో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెడుతున్నాం. ఇంకా ఇబ్బందులు ఉన్నా, అభివృద్ధి సాధించగలమన్న విశ్వాసం మాకుంది" అని అన్నారు.
అమరావతికి కేవలం ఆర్థిక సంస్థలే కాకుండా ప్రపంచస్థాయి విద్యా, వైజ్ఞానిక సంస్థలు కూడా తరలివస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. విట్, ఎస్ఆర్‌ఎం వంటి విశ్వవిద్యాలయాలతో పాటు, క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కోసం క్వాంటం వ్యాలీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో కాస్మోస్ ప్లానెటోరియం కూడా ఏర్పాటు కానుండటం శుభపరిణామమన్నారు.
త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారిని పూర్తి చేస్తామని, 7 జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అమరావతిని అనుసంధానిస్తామని చెప్పారు. అమరావతిని పూర్తిస్థాయి గ్రీన్, బ్లూ సిటీగా తీర్చిదిద్ది, భారతదేశం గర్వపడే రాజధానిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిపైనా ఆయన కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని, అయితే కూటమి ప్రభుత్వంపై భరోసాతో ఏపీకి మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయని, అందులో భాగంగానే గూగుల్ సంస్థ రూ.1.37 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖకు వస్తోందని వెల్లడించారు.
మరోవైపు, గోదావరి, కృష్ణా నదుల నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని పోలవరం నుంచి నల్లమల సాగర్‌కు అనుసంధానించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు పూర్వోదయ పథకం కింద ఉదారంగా నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, కేంద్ర సహకారంతో ఏపీ త్వరలోనే నిలదొక్కుకుని దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.