అసీం మునీర్‌కు అవకాశం దొరికితే.. ఇమ్రాన్‌ను ఎప్పుడో చంపేవారు: భారత మాజీ అధికారి సంచలనం
- ఇమ్రాన్ ఖాన్ ఆచూకీపై కొనసాగుతున్న ఉత్కంఠ, గందరగోళం
- ఇమ్రాన్‌కు ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నారని సెనెట్‌లో పీటీఐ ఆరోపణ
- సోషల్ మీడియా వల్లే ఇమ్రాన్‌కు ఇప్పటికీ తగ్గని ప్రజాదరణ అని విశ్లేషణ
- ఇమ్రాన్, ఆర్మీ చీఫ్ మధ్య తీవ్రమైన అధికార పోరు నడుస్తోందని నిపుణుల అభిప్రాయం
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌కు అవకాశం దొరికి ఉంటే, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఎప్పుడో చంపేసేవారని భారత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) మాజీ డైరెక్టర్, లెఫ్టినెంట్ జనరల్ కమల్‌జీత్ సింగ్ ధిల్లాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ, ఆయన క్షేమంపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, ఓ భారత న్యూస్ చానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ అంశం పాకిస్థాన్ సెనెట్‌లో కూడా వాడివేడి చర్చకు దారితీసింది. ఇమ్రాన్‌కు ప్రభుత్వం కనీస హక్కులను కూడా కల్పించడం లేదని ఆయన పార్టీ పీటీఐ సెనెటర్ ఫైజల్ జావేద్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన అంతర్గత వ్యవహారాల సహాయ మంత్రి తలాల్ చౌదరి, ఇమ్రాన్ ఖాన్‌ను వీవీఐపీ ఖైదీగా చూస్తున్నామని బదులిచ్చారు.
ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ పాక్‌లోని పరిస్థితులను విశ్లేషించారు. ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య తీవ్రమైన అధికార పోరు నడుస్తోందని ఆయన తెలిపారు. గతంలో భుట్టోల వంటి నేతలతో పోలిస్తే, సోషల్ మీడియా ప్రభావంతో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ తన ప్రజాదరణను నిలుపుకోగలుగుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ అసాధారణ ప్రజాదరణే ఆర్మీకి పెద్ద సవాలుగా మారిందని ఆయన వివరించారు.
మరోవైపు, ఇమ్రాన్ మరణించారంటూ ఆఫ్ఘన్ మీడియాలో నిర్ధారణ కాని వార్తలు రావడం, పాకిస్థాన్ సైన్యంలోని అంతర్గత డైనమిక్స్ వంటి అంశాలు దేశంలో ప్రజా తిరుగుబాటుకు దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.