సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పూల విక్రమ్

  • అధికార భాషా సంఘం నూతన అధ్యక్షుడిగా పూల విక్రమ్
  • ఇటీవల నియామక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన సీనియర్ జర్నలిస్ట్
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, రచయిత పూల విక్రమ్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పూల విక్రమ్ సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

తనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినందుకు ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుగా, రచయితగా తెలుగు భాషాభివృద్ధికి విక్రమ్ చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పదవిని అప్పగించింది. ఈ నియామకం పట్ల పలువురు సాహితీ, పాత్రికేయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News