'డ్యూడ్' పాటల వివాదం... ఇప్పుడెందుకు వచ్చారని ఇళయరాజాను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
- డ్యూడ్' సినిమాలో తన పాటలు వాడారని ఇళయరాజా కేసు
- సినిమా విడుదలై హిట్టయ్యాకకేసు వేయడంపై హైకోర్టు ప్రశ్న
- సోనీ నుంచి హక్కులు తీసుకున్నామన్న మైత్రీ మూవీ మేకర్స్
- ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ వాయిదా
తన పాటలను అనుమతి లేకుండా 'డ్యూడ్' సినిమాలో వాడుకున్నారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్, ఇళయరాజా తరఫు న్యాయవాదిని పలు కీలక ప్రశ్నలు అడిగారు. "సినిమా థియేటర్లు, ఓటీటీలలో విడుదలై విజయం సాధించాక ఇప్పుడు కేసు వేయడంలో ఆంతర్యం ఏమిటి?" అని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి మైత్రీ మూవీ మేకర్స్ తమ క్లయింట్ పాటలను సినిమాలో ఉపయోగించుకుందని ఆరోపించారు. పాటల హక్కులు ఇళయరాజాకే ఉన్నాయని, వెంటనే సినిమా నుంచి వాటిని తొలగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది.. తాము పాటల హక్కులను 'సోనీ' సంస్థ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సోనీ వాటిని 'ఎకో' సంస్థ నుంచి పొందిందని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సినిమా విడుదలయ్యే వరకు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు వచ్చారని ఇళయరాజా తరఫు న్యాయవాదిని నిలదీశారు. 30 ఏళ్ల నాటి పాటలకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోందని, దీనివల్ల ఇళయరాజాకు ఎలాంటి నష్టం జరిగిందని ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా కేసును వాయిదా వేసింది. ఈ కేసుతో పాత పాటల కాపీరైట్ల అంశం మరోసారి తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.