మమతా బెనర్జీ, పాకిస్థాన్ మంత్రికి కంగనా రనౌత్ కౌంటర్

  • మమతా బెనర్జీ లాంటి వారి బెదిరింపులకు దేశం భయపడదన్న కంగన
  • చొరబాటుదారులు క్యాన్సర్ లాంటి వారన్న కంగనా రనౌత్
  • చొరబాటుదారులు ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)పై ఆమె చేసిన విమర్శలపై స్పందించారు. బీజేపీపై మమత బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేయగా, కంగన ఆమె వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు.

మమతా బెనర్జీ లాంటి వారి బెదిరింపులకు దేశం భయపడదని, చొరబాటుదారులు ఉండకూడదని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె అన్నారు. చొరబాటుదారులు క్యాన్సర్ లాంటివారని, వారిని సాగనంపాల్సిందేనని కంగన స్పష్టం చేశారు.

అయోధ్య రామాలయం ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన విమర్శలపై కూడా కంగన స్పందించారు. రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతుండటంతో పాకిస్థాన్ భయపడుతోందని అన్నారు. ఆ దేశం ఒక భిక్షాటన పాత్రగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. భారత్ ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో మరింత ముందుకు వెళుతుందని ఆమె పేర్కొన్నారు.


More Telugu News