ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి హైదరాబాద్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ
- డబ్బులు వసూలు చేసిన మాదాపూర్‌లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ
- 400 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు
- డబ్బులతో పరారైన డైరెక్టర్ స్వామినాయుడు
హైదరాబాద్ నగరంలో మరో ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరిట ఒక్కో విద్యార్థి, నిరుద్యోగి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసి కంపెనీ డైరెక్టర్ పరారైనట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ సుమారు 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది.
రూ.3 లక్షలు చెల్లిస్తే శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇస్తామని ఈ సంస్థ నమ్మబలికింది. దీంతో వందలాది మంది డబ్బులు చెల్లించారు. విద్యార్థులను మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు పరారయ్యాడు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.