Ramalinga Raju Manthena: తిరుమలకు రూ.9 కోట్ల భారీ విరాళం.. మరోసారి దాతృత్వం చాటుకున్న రామలింగరాజు మంతెన

Ramalinga Raju Manthena Donates Rs 9 Crore to Tirumala TTD
  • తిరుమల పీఏసీల ఆధునికీకరణకు రూ.9 కోట్ల విరాళం
  • ఎన్నారై రామలింగరాజు మంతెన నుంచి టీటీడీకి విరాళం
  • కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళం అందజేత
  • 2012లోనూ రూ.16 కోట్లు విరాళం ఇచ్చిన రాజు 
  • సామాన్య భక్తుల సౌకర్యాల కోసమే ఈ నిధులని వెల్లడి
తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు రామలింగరాజు మంతెన రూ.9 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పీఏసీ 1, 2, 3 యాత్రికుల వసతి సముదాయాల ఆధునికీకరణ పనుల కోసం ఈ విరాళాన్ని అందించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తెలిపింది. తన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన దాతకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ రామలింగరాజు నుంచి ఇలాంటి గొప్ప విరాళాలు అందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పల నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రామలింగరాజు మంతెన టీటీడీకి భారీగా విరాళం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2012వ సంవత్సరంలోనూ ఆయన రూ.16 కోట్లను విరాళంగా అందజేశారు. కాగా, ఇటీవల ఆయన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజుల వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Ramalinga Raju Manthena
Tirumala
TTD
Donation
Tirupati
NRI
PAC Accommodation
BR Naidu
Netra Manthena
Vamsi Gadiraju

More Telugu News