ముంబైలో విరాట్ కోహ్లీ.. ఫ్యాన్స్‌తో సెల్ఫీల సందడి

  • ద‌క్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన కోహ్లీ
  • ముంబై ఎయిర్‌పోర్టులో అభిమానులతో ఫొటోలు దిగిన స్టార్ క్రికెటర్
  • దివంగత నటుడు ధర్మేంద్రకు ఘన నివాళి అర్పించిన విరాట్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముంబైలో అడుగుపెట్టాడు. ఈ నెల‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు అతడు భారత్‌కు తిరిగి వచ్చాడు. దాదాపు ఆరు నెల‌ల త‌ర్వాత స్వ‌దేశంలో అడుగు పెట్టాడు. ముంబై విమానాశ్రయంలో కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ, మొదట ఫొటోలకు నిరాకరించి నేరుగా తన కారు వద్దకు వెళ్లాడు. అయితే, అభిమానులు కోరడంతో కాసేపటి తర్వాత కారు దిగి వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా కనిపించిన కోహ్లీ.. అక్కడున్న వారితో మాట్లాడటమే కాకుండా అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దిగ్గజ నటుడు ధర్మేంద్రకు నివాళి
ఇదిలా ఉంటే.. సోమవారం ముంబైలో కన్నుమూసిన దిగ్గజ నటుడు ధర్మేంద్రకు విరాట్ కోహ్లీ భావోద్వేగ నివాళి అర్పించాడు. భారత సినిమా ఒక గొప్ప లెజెండ్‌ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. "ధర్మేంద్ర తన నటనతో, చరిష్మాతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయనో నిజమైన ఐకాన్. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలి. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని కోహ్లీ తన సందేశంలో పేర్కొన్నాడు.


More Telugu News