Pranathi: కాళ్ల పారాణి ఆరకముందే... రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Pranathi Newly Wed Bride Dies in Siddipet Road Accident
  • సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ట్రాక్టర్
  • నవ వధువు ప్రణతి అక్కడికక్కడే దుర్మరణం
  • భర్త సాయికుమార్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
  • గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు
సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయి కొద్ది రోజులు కూడా గడవకముందే ఓ నవ వధువు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్త జీవితం ప్రారంభిస్తున్న ఆ జంటను విధి వెక్కిరించడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే, మీరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్‌కు, ప్రణతి(24)కి ఇటీవల వివాహం జరిగింది. ఉద్యోగ రీత్యా ఇద్దరూ బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు.

చేతి గోరింటాకు, కాళ్ల పారాణి ఆరకముందే ప్రణతి మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో చెప్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Pranathi
Siddipet accident
Road accident
Telangana news
Chepyala village
Sai Kumar
Tractor accident
Newly wed bride death

More Telugu News