Ghatkesar: ఘట్‌కేసర్ లో హడలెత్తించిన భారీ కొండచిలువ... వీడియో ఇదిగో!

Giant Python Creates Panic in Ghatkesar
  • మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో భారీ కొండచిలువ కలకలం
  • చిన్న చెరువు సమీపంలో పాము సంచారం
  • నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పాము కనిపించడంతో ఆందోళన
  • వెంటనే బంధించి జూకు తరలించాలని అధికారులకు విజ్ఞప్తి
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో భారీ కొండచిలువ సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పట్టణంలోని చిన్న చెరువు సమీపంలో ఓ భారీ కొండచిలువ కనిపించడంతో జనం హడలిపోయారు.

నిత్యం ప్రజలు, వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద పాము కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని పొదల నుంచి ఇది జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొండచిలువ వల్ల ఎవరికైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కొండచిలువను సురక్షితంగా బంధించి, జూపార్కుకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Ghatkesar
Ghatkesar python
Medchal Malkajgiri
Ghatkesar snake
Python rescue
Snake in residential area
Forest department
Hyderabad
Telangana
Wildlife

More Telugu News