ముగిసిన నాలుగో రోజు ఆట... ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఓటమి ఖాయం!

  • భారత్‌ ముందు 549 పరుగుల కొండంత లక్ష్యం
  • లక్ష్య ఛేదనలో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ విఫలం
భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరారు. 

మార్కో జాన్సెన్ వేసిన ఏడో ఓవర్‌లో యశస్వి జైస్వాల్ (13) ఔటయ్యాడు. కాసేపటికే సైమన్ హార్మర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓటమిని తప్పించుకోవాలంటే చివరి రోజు భారత బ్యాటర్లు అద్భుత పోరాటం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన కుల్దీప్ యాదవ్ ఉన్నారు. మ్యాచ్ గెలవాలంటే భారత్ చివరి రోజు మరో 522 పరుగులు చేయాల్సి ఉండగా, దక్షిణాఫ్రికా విజయానికి 8 వికెట్లు అవసరం.

సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా: 489 & 260/5 డిక్లేర్డ్ (ట్రిస్టన్ స్టబ్స్ 94, టోనీ డి జోర్జి 49; రవీంద్ర జడేజా 4/62)
భారత్: 201 & 27/2 (యశస్వి జైస్వాల్ 13; సైమన్ హార్మర్ 1/1)


More Telugu News