గుడ్ బ్యాడ్ అగ్లీ' కాంబో రిపీట్.. అజిత్‌తో మరో సినిమా కన్ఫర్మ్!

Ajith Kumar Confirms Another Movie with Adhik Ravichandran
  • గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్‌తో మరో సినిమా
  • ధృవీకరించిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్
  • ఫిబ్రవరి చివరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడి
  • ఇప్పటికే  ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయన్న రవిచంద్రన్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ శుభవార్తను అందించారు. ఈ ఏడాది వీరిద్దరి కలయికలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అజిత్‌తో మరో సినిమా చేయనున్నట్లు అధిక్ రవిచంద్రన్ అధికారికంగా ప్రకటించారు.

చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అజిత్‌తో చేయబోయే తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. "ప్రస్తుతం లొకేషన్ల ఎంపిక జరుగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది," అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి. 

Go Back to Shorts
Ajith Kumar
Good Bad Ugly
Adhik Ravichandran
Kollywood
Tamil Cinema
Mythri Movie Makers
Tamil Film
New Movie
Chennai
Movie shooting

More Telugu News