మీ వాహనానికి 15 ఏళ్లు దాటాయా?.. అయితే ఇకపై మీ జేబుకు చిల్లే!
- 15 ఏళ్లు దాటిన వాహనాలకు భారీగా పెరిగిన ఫిట్‌నెస్ ఫీజులు
- కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
- కార్లు, క్యాబ్‌లు, లారీలకు తప్పని ఫీజుల భారం
15 ఏళ్లు దాటిన పాత వాహనాలను రోడ్లపై తిప్పాలనుకునే యజమానులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వాటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫీజులను భారీగా పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పాత వాహనాల నిర్వహణ మరింత భారంగా మారనుంది.
తాజా నిబంధనల ప్రకారం 15 ఏళ్ల వరకు రూ.944గా ఉన్న నాలుగు చక్రాల క్యాబ్ ఫిట్‌నెస్ ఫీజు, ఆ గడువు దాటితే ఏడాదికి రూ.5,310కి చేరనుంది. అదే వాహనం 20 ఏళ్లు పూర్తి చేసుకుంటే ఏకంగా రూ.10,620 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సొంత కార్ల (ఎల్‌ఎంవీ) విషయానికొస్తే, 15 ఏళ్ల తర్వాత ఫీజు రూ.10,030 కాగా, 20 ఏళ్లు దాటితే రూ.20,060 భరించక తప్పదు.
సరుకు రవాణా వాహనాలపై ఈ భారం మరింత ఎక్కువగా ఉంది. మధ్యస్థాయి గూడ్స్ వాహనాలకు (ఎంజీవీ) 15 నుంచి 20 ఏళ్ల మధ్య కాలంలో ఏటా రూ.13,384, 20 ఏళ్లు దాటితే రూ.33,040 చొప్పున ఫీజు చెల్లించాలి. భారీ వాహనాలైన లారీలకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, తమ వాహనాలు మంచి కండీషన్‌లో ఉన్నప్పటికీ ఇంత భారీగా ఫీజులు వసూలు చేయడం సరికాదని రవాణా రంగ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు.