రిచర్డ్ రిషి నటిస్తున్న ‘ద్రౌపది 2’... ఆకట్టుకుంటున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్

  • రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ద్రౌపది 2'
  • హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ విడుదల
  • ద్రౌపది దేవీ పాత్రలో నటిస్తున్న రక్షణ
  • శరవేగంగా జరుగుతున్న సినిమా షూటింగ్
నటుడు రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ద్రౌపది 2’. ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో ఆమె ద్రౌపది దేవి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై సోల చక్రవర్తి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మోహన్. జి దర్శకత్వం వహిస్తున్నారు.

విడుదలైన పోస్టర్‌లో రక్షణ ఇందుచూడన్ ఎంతో హుందాగా, గాంభీర్యంగా కనిపిస్తోంది. ఆమె ఆహార్యం, అలంకరణ పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న భారీ సెట్, సినిమాను ఏ స్థాయిలో నిర్మిస్తున్నారో తెలియజేస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, ఫిలిప్ ఆర్ సుందర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ సంతోష్ పోరాట సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. దేవరాజ్.ఎస్ ఎడిటర్‌గా, ఎస్ కే ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


More Telugu News