అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లిన సీపీ స‌జ్జనార్

––
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలువురు రౌడీషీటర్ల నివాసాలకు వెళ్లి పరిశీలించారు. అధికారులను వెంటబెట్టుకుని ఆయన పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను ఆయన హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి, గస్తీ పాయింట్లు, స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేశారు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి ప్రాంతాల్లో గస్తీ నిర్వహించారు. రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలిపై ఆరా తీశారు. నేర ప్రవృత్తిని మానుకోవాలని ఆయన హెచ్చరించారు.


More Telugu News