మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. బెంగళూరు క్యాబ్ డ్రైవర్ పెట్టిన రూల్స్ వైరల్!

  • క్యాబ్‌ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల‌ బోర్డు నెట్టింట‌ వైరల్
  • ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలో సూచిస్తూ పెట్టిన ఆరు రూల్స్
  • సోషల్ మీడియాలో మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
సాంకేతిక రాజధాని బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన నిబంధనల బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలో సూచిస్తూ ఆయన పెట్టిన ఆరు రూల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి ప్రయాణించిన క్యాబ్‌లో ఈ బోర్డు కనిపించింది. దానిని ఫోటో తీసి, "నిన్న నా క్యాబ్‌లో ఇది చూశాను" అనే క్యాప్షన్‌తో 'r/bangalore' అనే రెడిట్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది. 

ఆ బోర్డులో ఉన్న ఆరు నిబంధనలు ఇవే..
1. మీరు ఈ కారు యజమాని కాదు.
2. ఈ కారు నడుపుతున్న వ్యక్తి దీని యజమాని.
3. మర్యాదగా మాట్లాడండి, గౌరవం పొందండి.
4. కారు డోర్‌ను నెమ్మదిగా మూయండి.
5. దయచేసి మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి. మాకు ఎక్కువ డబ్బులివ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించవద్దు.
6. మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు.

వీటితో పాటు వేగంగా నడపమని అడగవద్దని కూడా డ్రైవర్ ఆ బోర్డులో పేర్కొన్నారు.

ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. 



More Telugu News