ఆగింది ఐబొమ్మే.. పైరసీ కాదు

  • శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ మూవీ రూల్జ్‎లో ప్రత్యక్షం
  • థియేటర్ లో రికార్డు చేసి పైరసీ సైట్ లో అప్ లోడ్
  • ప్రేమంటే, రాజు వెడ్స్‌ రాంబాయి సహా ఇతర సినిమాలు కూడా..
పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసి ఐబొమ్మతో పాటు బప్పం టీవీ సైట్ లను క్లోజ్ చేసినా సినిమా పైరసీ ఆగడంలేదు. ఆగింది ఐబొమ్మే తప్ప పైరసీ కాదని తాజాగా తేలింది. శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ఒకే రోజులో పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనం. ఐబొమ్మ కన్నా ముందునుంచే సినిమాలను పైరసీ చేస్తున్న మూవీరూల్జ్ సైట్ లో తాజా సినిమాలన్నీ ప్రత్యక్షమయ్యాయి.

థియేటర్లలో వీడియో కెమెరాతో రికార్డు చేసి ఈ సైట్ లో అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సినిమాలు అల్లరి హీరోగా వచ్చిన 12ఏ రైల్వే కాలనీతో పాటు సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్‌ రాంబాయి, ప్రేమంటే సినిమాలు మూవీరూల్జ్‎ సైట్ లో కనిపిస్తున్నాయి. విడుదలైన ఒక్కరోజులోనే సినిమాలు పైరసీ సైట్ లో ప్రత్యక్షం కావడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News