iBomma Ravi: ఐబొమ్మ రవిని వారం రోజుల్లో బెయిల్‌పై తీసుకొస్తా: వైజాగ్ న్యాయవాది సలీం

iBomma Ravi likely to get bail in a week says lawyer
  • ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్టయిన ఇమంది రవి
  • కేసు వాదించేందుకు రంగంలోకి దిగిన వైజాగ్‌ సీనియర్ న్యాయవాది
  • సికింద్రాబాద్‌లో సలీంతో భేటీ అయిన జాతీయ మానవ హక్కుల కమిటీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇమంది రవికి వారం రోజుల్లో బెయిల్ ఇప్పిస్తానని ఆయన తరఫు న్యాయవాది సలీం ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో వాదించేందుకు వైజాగ్‌కు చెందిన సీనియర్ హైకోర్టు న్యాయవాది సలీం హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆఫ్ ఇండియా బృందం ఆయనను ప్రత్యేకంగా కలిసింది. కమిటీ జాతీయ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, జాతీయ కోశాధికారి తులసి, లీగల్ సలహాదారురాలు లక్ష్మిసౌజన్య, ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు.

అనంతరం కటకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం వారం రోజుల్లోనే ఐబొమ్మ రవిని బెయిల్‌పై బయటకు తీసుకొస్తానని న్యాయవాది సలీం హామీ ఇచ్చారని తెలిపారు. రవి, తాను ఇద్దరూ వైజాగ్‌కు చెందినవారేనని, అందుకే అతడిని బయటకు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటానని సలీం చెప్పినట్లు ఆయన వివరించారు. 
iBomma Ravi
iBomma
Immidi Ravi
Piracy Case
Bail
Advocate Saleem
National Human Rights Committee of India
Katakam Srinivas
Vizag
Telugu Movies

More Telugu News