HD Kumaraswamy: త్వరలో కర్ణాటక కేబినెట్‌లో భారీ కుదుపు... కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

HD Kumaraswamy Predicts Major Changes in Karnataka Cabinet
  • కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులుంటాయన్న కుమారస్వామి
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అంతర్గత గందరగోళ పరిస్థితులు 
  • ప్రభుత్వ అప్పు రూ.7.5 లక్షల కోట్లు దాటిందన్న కేంద్ర మంత్రి
  • ధరల పెంపుతో ప్రజలు విసిగిపోయారని విమర్శ
రానున్న రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మధ్య అంతర్గత పోరు నడుస్తోందన్న ఊహాగానాల నడుమ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర గందరగోళం నెలకొందని, ఇది త్వరలోనే కీలక మార్పులకు దారితీయొచ్చని ఆయన జోస్యం చెప్పారు.

బెంగళూరులో జరిగిన జేడీఎస్‌ రజతోత్సవ వేడుకల్లో కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. మరికొన్ని నెలల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి" అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ మోసానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

కర్ణాటక ప్రభుత్వ అప్పులు రూ.7.5 లక్షల కోట్లు దాటాయని, ఇందులో ఒక్క సిద్ధరామయ్య హయాంలోనే రూ.5.5 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఇన్ని అప్పులు ఎందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన పన్నులు, నిత్యవసరాల ధరలతో ప్రజలు విసిగిపోయారని, ఈసారి జేడీఎస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజలకు మెరుగైన పాలన అందించలేకపోతే, తన జీవితంలో మళ్లీ ముఖం చూపించనని కుమారస్వామి స్పష్టం చేశారు. 
HD Kumaraswamy
Karnataka politics
Siddaramaiah
DK Shivakumar
Karnataka cabinet reshuffle
JDS
Congress government Karnataka
Karnataka government debts
Karnataka political crisis
JDS silver jubilee celebrations

More Telugu News