Chandrababu Naidu: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు
- అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు
- పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
- నాణ్యత, సాంకేతికతపై రాజీ వద్దని వెల్లడి
కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనుల తీరును క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని మంత్రి జనార్థన్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్నమైన మెటీరియల్‌ను వినియోగించే పద్ధతులను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.