ఐ-బొమ్మ రవి కేసు దర్యాప్తు చేస్తున్నసైబర్ క్రైమ్ డీసీపీ కవిత వరంగల్‌కు బదిలీ

  • వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా దార కవిత బదిలీ
  • కవిత స్థానంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు నియామకం
  • హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుచేంద్ర ఎస్బీ డీసీపీగా బదిలీ
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ పోలీసు వ్యవస్థలో భారీగా బదిలీలు చేపట్టింది. తొమ్మిది మంది నాన్-కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా ఐ-బొమ్మ రవి కేసును దర్యాప్తు చేస్తున్న డీసీపీ దారా కవితను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు. ఐ-బొమ్మ రవి కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే కవితను బదిలీ చేయడం గమనార్హం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో డీసీపీగా ఉంటూ ఆమె పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు.

కవిత స్థానంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబును నియమించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న వై.వీ.ఎస్. సుచేంద్రను హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా నియమించారు.

పెద్దపల్లి డీసీపీ పీ. కరుణాకర్‌ను ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ బి. సాయిశ్రీని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఎస్‌.వీ.ఎన్. శివరాంను ఏసీబీ ఎస్పీగా, ట్రాన్స్‌కో ఎస్పీగా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ విభాగంలో కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న రవీంద్రరెడ్డిని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌‌గా బదిలీ చేశారు. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న అశోక్ కుమార్‌ని సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.


More Telugu News