బెంగళూరులో ప్రైవేటు ఫంక్షన్‌లో పక్కపక్కనే జగన్, కేటీఆర్

  • పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న జగన్, కేటీఆర్
  • ఇద్దరు కలిసి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు వైరల్
  • కేటీఆర్ చెబుతుంటే వింటూ కూర్చున్న జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ ఏదో చెబుతుండగా జగన్ వేడుకను తిలకిస్తూ విన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వారిద్దరు కలిసి బయటి నుంచి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మొదటి టర్మ్ తెలుగుదేశం, రెండో టర్మ్ వైసీపీ ప్రభుత్వాలు పాలించాయి. ఈ క్రమంలో 2019 నుంచి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలు కొనసాగాయానే ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాయి.

ఇటీవల కేసీఆర్ పై, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై జగన్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు ఒక వేడుకలో కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


More Telugu News