మా కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెంటర్: సోమిరెడ్డి
- నెల్లూరులోని శ్రీనివాసమహల్‌తో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకున్న సోమిరెడ్డి
- ఒకప్పుడు తమ సినిమా హాల్ పెద్ద పొలిటికల్ సెంటర్ అని వ్యాఖ్య
- ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మించిన జైన్ మందిరం ప్రారంభోత్సవానికి హాజరు
- అక్కడ అడుగుపెట్టగానే పాత రాజకీయ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని వెల్లడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నెల్లూరులోని తమ కుటుంబానికి చెందిన శ్రీనివాసమహల్ సినిమా హాల్ స్థలాన్ని సందర్శించినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకప్పుడు రాజకీయాలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రదేశంలో అడుగుపెట్టగానే పాత రోజులు గుర్తుకొచ్చాయని ఆయన ఎక్స్ వేదికగా వివరించారు.
"నెల్లూరులోని శ్రీనివాసమహల్ అంటేనే మాకు ఒక ఎమోషన్. మా కుటుంబానికి చెందిన ఈ సినిమా హాల్ అప్పట్లో పెద్ద పొలిటికల్ సెంటర్. ఎందరో రాజకీయ ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్. కాలక్రమంలో మా కుటుంబం ఆ సినిమాహాలును విక్రయించగా ప్రస్తుతం జైనులు కొనుగోలు చేసి అపార్టుమెంటు నిర్మించారు. ఆ అపార్టుమెంటు ప్రాంగణంలో నిర్మించిన జైన్ మందిరం ప్రారంభోత్సవానికి పెద్దల ఆహ్వానం మేరకు నేను, మా సోదరుడు శ్రీనివాసులు రెడ్డి వెళ్లాం. అక్కడ అడుగుపెట్టగానే పాతరోజులు గుర్తుకొచ్చాయి. శ్రీనివాసమహల్ కేంద్రంగా చేసిన రాజకీయ కార్యకలాపాల జ్ఞాపకాలను నెమరేసుకున్నాం" అని ట్వీట్ చేశారు. ఈ మేరకు సోమిరెడ్డి కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు.