పుట్టపర్తిలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

  • పుట్టపర్తికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
  • ఆయనకు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
  • భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి
  • సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కూడా హాజరు
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు పుట్టపర్తి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఈ పర్యటనలో భాగంగా. ముందుగా ప్రశాంతి నిలయంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


More Telugu News