హిందువులు లేకుంటే ప్రపంచమే ఉండదు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- హిందువులు లేకపోతే ప్రపంచం అంతరిస్తుందన్న మోహన్ భగవత్
- హిందూ సమాజం అమరమైనదని వ్యాఖ్య
- ప్రాచీన నాగరికతలు అంతమైనా మనం నిలిచి ఉన్నామని వెల్లడి
- ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందూ సమాజానిదేనన్న వైనం
- జాతి ఘర్షణల తర్వాత తొలిసారి మణిపూర్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటన
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ హిందూ సమాజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు లేకపోతే ఈ ప్రపంచమే అంతరించిపోతుందని, ప్రపంచ మనుగడకు హిందూ సమాజమే కేంద్రమని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో పర్యటిస్తున్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రీస్ (యూనాన్), ఈజిప్ట్ (మిస్ర్), రోమ్ వంటి గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ భారత నాగరికత మాత్రం ఇప్పటికీ నిలిచి ఉందని మోహన్ భగవత్ గుర్తుచేశారు. "ప్రపంచంలోని ప్రతీ దేశం ఎన్నో రకాల పరిస్థితులను చూసింది. కానీ మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది, అందుకే మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. హిందూ సమాజం అమరమైనది" అని ఆయన వివరించారు.
భారత్ అనేది ఒక అమర నాగరికతకు పేరు అని పేర్కొన్న భగవత్.. ప్రపంచ ధర్మాన్ని కాపాడే సంరక్షకులుగా హిందూ సమాజాన్ని అభివర్ణించారు. "మన సమాజంలో మనం నిర్మించుకున్న బలమైన వ్యవస్థ కారణంగా హిందూ సమాజం ఎప్పటికీ ఉంటుంది. హిందువులు లేకపోతే ప్రపంచం అంతం కావడం ఖాయం" అని ఆయన అన్నారు. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మోహన్ భగవత్ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.