హీరా గ్రూప్ ఎండీకీ షాక్.. రూ.19 కోట్ల విలువైన స్థిరాస్తి వేలం

  • అధిక వడ్డీ ఆశజూపి రూ.5,900 కోట్లు వసూలు చేసిన హీరా గ్రూప్
  • దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదు
  • ఆస్తులు వేలం వేసి బాధితులకు అందజేయనున్న ఈడీ
హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌‍కు సంబంధించిన రూ.19.64 కోట్ల విలువైన స్థిరాస్తిని ఈడీ వేలం వేసింది. హీరా గోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు ఈడీ ప్రకటించింది. అటాచ్ చేసిన ఆస్తులను విక్రయానికి పెడుతున్నట్లు తెలిపింది. అధిక వడ్డీ ఆశ చూపి దేశవ్యాప్తంగా రూ. 5,900 కోట్లతో హీరా గ్రూప్ బోర్డు తిప్పేసింది. దేశవ్యాప్తంగా 52కు పైగా కేసులు నమోదయ్యాయి.

36 శాతం వడ్డీ ఆశ జూపి హీరా గ్రూప్ గతంలో పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలను సమీకరించింది. కానీ అసలు, వడ్డీ ఇవ్వకుండా బాధితులను మోసం చేసింది. ఈ క్రమంలో హీరా గ్రూప్‌నకు చెందిన రూ.428 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పటి వరకు రూ. 93.63 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేసింది. ఈ వేలం ద్వారా సమీకరించిన మొత్తాన్ని బాధితులకు అందజేయనుంది.


More Telugu News