బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం... సీఐడీ విచారణకు హాజరైన శ్రీముఖి, నిధి అగర్వాల్
- లక్డీకాపూల్ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన సినీతారలు
- బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన వారిని విచారిస్తున్న సీఐడీ
- జంగిల్ రమ్మీకి ప్రమోట్ చేసిన శ్రీముఖి
బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన వ్యవహారంలో ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృతా చౌదరి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన ప్రముఖులను సీఐడీ అధికారులు వరుసగా విచారిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల నటులు విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్‌లను సీఐడీ అధికారులు విచారించారు. యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిని సీఐడీ వరుసగా విచారణకు పిలుస్తోంది. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి వీరు విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ యువత ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో, వీటిని ప్రమోట్ చేసిన ప్రముఖులపై కొన్ని నెలల క్రితం కేసు నమోదైంది. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ అంశంపై దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. శ్రీముఖి జంగిల్ రమ్మీ యాప్‌ను ప్రమోట్ చేయగా, అమృత చౌదరి పలు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేశారు.