ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘రెబల్ సాబ్’ పేరుతో రానున్న ఫస్ట్ సింగిల్
- ఎల్లుండి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటన
- మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు ‘రెబల్ సాబ్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుపుతూ.. ఈ పాటను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీతో పాటు జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తుండగా, తాజా ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.