బెంగళూరులో 3BHKకి లక్ష అద్దె.. ఇదేం దారుణమంటూ టెక్కీ పోస్ట్!
- సోషల్ మీడియాలో అనుభవాన్ని పంచుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
- టెక్కీ పోస్టుపై నెటిజన్ల నుంచి భారీ స్పందన
- ఐటీ ఉద్యోగుల వల్లే అద్దెలు పెంచుతున్నారన్న ఆరోపణ
భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు, ఉద్యోగులు అద్దె ఇల్లు వెతుక్కోవాలంటేనే జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ టెక్ నిపుణుడు తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
బెంగళూరులోని ఓ స్టార్టప్‌లో ప్రొడక్ట్ డిజైనర్‌గా పనిచేస్తున్న సాహిల్ ఖాన్ కొత్త ఇంటి కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో కూక్ టౌన్ ప్రాంతంలో 3BHK ఇంటికి ఏకంగా లక్ష రూపాయల అద్దె అడగడంతో ఆయన షాక్ అయ్యారు. "కూక్‌టౌన్‌లో 3BHKకి లక్ష అద్దె అడుగుతున్నారు. వీళ్లకు ఏమైనా పిచ్చి పట్టిందా?" అంటూ ఎక్స్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్న సాహిల్ ప్రస్తుతం కోరమంగళలో 2BHKకి రూ. 50,000 చెల్లిస్తున్నారు. ఆయన పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. "ముంబైకి రా బ్రో, లక్ష రూపాయలకు మంచి 2BHK దొరుకుతుంది" అని ఒకరు సరదాగా కామెంట్ చేయగా, "సొంత ఇల్లు కొనుక్కోమని వాళ్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు" అని మరొకరు చమత్కరించారు. ఢిల్లీలో అద్దెలు, డిపాజిట్లు చాలా తక్కువని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
లక్ష రూపాయలు అడిగిన ఇల్లు సెమీ-ఫర్నిష్డ్‌గా ఉందని, కనీసం గేటెడ్ కమ్యూనిటీలో కూడా లేదని సాహిల్ తెలిపారు. నిర్వహణ చార్జీలు కూడా అదనమని చెప్పారు. మరోవైపు, రూ. 65,000కే ఒక 3BHK దొరికినా, అది రైల్వే ట్రాక్ పక్కనే ఉండటంతో వద్దనుకున్నట్లు వివరించారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంపాదిస్తుండటంతో, వారి నుంచి డబ్బు గుంజాలనే ఉద్దేశంతోనే యజమానులు ఇలా అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారని ఆయన ఆరోపించారు. నగరంలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) పెంచి, మరిన్ని నివాస భవనాలకు అనుమతి ఇస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని సాహిల్ ఖాన్ అభిప్రాయపడ్డారు.